News March 22, 2024

శ్రీకాకుళం: పది పరీక్షలకు 1036 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. మొత్తం 29,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,358 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 1036 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Similar News

News October 24, 2025

ఇళ్ల కోసం అర్హులను గుర్తించండి: మంత్రి ఆదేశాలు

image

నవంబర్ 5లోగా ఆన్లైన్లో ఇళ్ల కోసం కోసం దరఖాస్తు చేసుకొని విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని సూచించారు. అర్హులను గుర్తించి ఇల్లు మంజూరు చేసేందుకు ఏర్పాటు చేయాలన్నారు.

News October 24, 2025

ఎచ్చెర్ల: వర్సిటీలో క్యాంటీన్ నిర్వహణకు దరఖాస్తు గడువు పెంపు

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో క్యాంటీన్ నిర్వహణకు గడువు తేదీ పెంచినట్లు యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య బి.అడ్డయ్య పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీలోగా https://www.brau.edu.in వెబ్సైట్లో దరఖాస్తు ఫారం సబ్మిట్ చేయాలని ఆయన కోరారు. గతంలో ప్రకటించిన తేదీకి దరఖాస్తులు రాకపోవడంతో గడువు పెంచినట్లు ఆయన తెలియజేశారు. పూర్తి వివరాలకు98662 99401 ఫోన్ నెంబర్‌కు సంప్రదించాలన్నారు.

News October 24, 2025

B.Ed పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed 3వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.30/-లు, పరీక్షల ఫీజు రూ.1305/-లతో కలిపి మొత్తం రూ.1335/-లను నవంబర్ 10వ తేదీ లోపు చెల్లించాలని ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ సూచించారు. హాల్ టికెట్లు నవంబర్ 15న, పరీక్షలు 25వ తేదీన జరుగుతాయన్నారు.