News April 1, 2024
శ్రీకాకుళం: పనసకు మంచి గిరాకీ

జిల్లా వ్యాప్తంగా పనస పంట సాగుచేస్తున్న ఉద్దానం ప్రాంతంలో పండే పనసకు మంచి గిరాకీ ఉంటుంది. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో సుమారు 300 ఎకరాల్లో పనస పంట సాగు చేస్తుండగా.. 600 నుంచి 650 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ పంట ఎక్కువగా ఒడిశా రాష్ట్రం బరంపురం, భువనేశ్వర్, కటక్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండగా, కొద్ది మొత్తంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తరలిస్తున్నారు.
Similar News
News September 9, 2025
శ్రీకాకుళం: ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మంత్రి

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకున్నారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన పోలింగ్ను పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించారు. పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News September 9, 2025
మాజీ మంత్రి సీదిరి హౌస్ అరెస్ట్

ఎరువుల కొరతపై రైతన్నకు బాసటగా వైసీపీ ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ, నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులను బయటకు రాకుండా చేయడం అన్యాయమని సీదిరి మండిపడ్డారు.
News September 9, 2025
శ్రీకాకుళం: టీనా మృతిపై ఎస్పీ దిగ్భ్రాంతి

పోలీసు శాఖలో 7 సంవత్సరాల పాటు విశేష సేవలందించిన పోలీసు జాగిలం ‘టీనా’ అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచింది. టీనా మృతి పట్ల ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయం ఆవరణంలో ఇవాళ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అదనపు ఎస్పీ కె.వి.రమణ తదితరులు నివాళులు అర్పించారు.