News March 25, 2024
శ్రీకాకుళం: పాము కాటుతో మహిళ మృతి

కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ చిన్న హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన చింతాడ చెల్లమ్మ (46) పాము కాటుతో సోమవారం మృతి చెందింది. ఇటీవల పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. మృతురాలి కుమారుడు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.
Similar News
News December 12, 2025
SKLM: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి గురువారం ప్రకటనలో తెలిపారు.ఇంధన పొదుపు ఆవశ్యకతను వినియోగదారులకు మరింత తెలిసేలా అవగాహన కల్పించేలా నిర్వహిస్తామన్నారు. ఈ వారోత్సవాలను శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ కేంద్రాల్లో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News December 12, 2025
శ్రీకాకుళం: SI ట్రైనింగ్ పూర్తయ్యినా పోస్టింగులు లేవు

ట్రైనింగ్ పూర్తిచేసుకున్న SIలకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై విశాఖ రేంజ్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 4 రేంజ్‌లలో ఇప్పటికే పోస్టింగులు ఇచ్చినా.. విశాఖ రేంజ్‌కే జాప్యం కొనసాగుతోంది. డిసెంబర్ 5తో ట్రైనింగ్ పిరియడ్ పూర్తయింది. విశాఖ రేంజ్లో మొత్తం 49 మంది SIలకు ట్రైనింగ్ పూర్తైనా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోపక్క నగరంలో పోలీసు సిబ్బంది కొరత ఉండటంతో లా అండ్ ఆర్డర్‌కు కష్టమౌతోంది.
News December 12, 2025
రైతుల సమస్యలపై శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ, ఎరువులు సంబంధించి సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఓ ప్రటన విడుదల చేశారు. రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9121863788 ఫోన్ చేసి తెలుసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.


