News May 23, 2024

శ్రీకాకుళం: పీజీ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు

image

విజయనగరంలోని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ అందించే పలు పీజీ కోర్సుల దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు ఆయా పీజీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్శిటీ వర్గాలు తెలిపాయి. అడ్మిషన్లకై https://ctuapcuet.samarth.edu.in/pg/ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సెంట్రల్ వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి.

Similar News

News March 2, 2026

SKKM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

image

మార్చి 2న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగాపై కార్యక్రమంలో, ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీల స్థాయిని తెలుసుకోవచ్చు అన్నారు.

News March 1, 2026

SKLM: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరి మృతి

image

కోటబొమ్మాళి మండలం వాండ్రాడ వద్ద ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆదివారం కళ్యాణ శ్రీనివాసరావు (48) వాండ్రాడ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు తీవ్ర గాయాలు కాగా నరసన్నపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 1, 2026

రణస్థలం: మామకు తలకొరివి పెట్టిన కోడలు

image

రణస్థలం కాపువీధికి చెందిన కె.రామప్పడు అనే విశ్రాంత ఉద్యోగి అనారోగ్యంతో మృతిచెందగా శనివారం ఆయన కోడలు ఉమా మామ మృతదేహానికి తలకొరివి పెట్టింది. రామప్పడు భార్య చిన్నమ్మడు, కుమారులు అప్పన్న, రాంబాబు కొన్నాళ్ల క్రితం మృతిచెందగా అనారోగ్యానికి గురైన మామకు అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.