News August 21, 2024
శ్రీకాకుళం: పీవీటీజీ జాతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పివిటిజి) అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన సంక్షేమ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం కలెక్టర్లను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణాలు, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, గిరిజన సంక్షేమం, పంచాయతీ రాజ్, తదితర శాఖలపై ఆయన జిల్లా కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు శ్రీకాకుళం నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
Similar News
News January 9, 2026
SKLM: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్‌ను పరీక్షల విభాగం అధికారి పద్మారావు గురువారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 18వ తేదీ లోపు కళాశాలల్లో, యూనివర్సిటీలో చెల్లించాలని సూచించారు. పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారం నుంచి నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు కాలేజీలకు సంప్రదించాలన్నారు.
News January 9, 2026
శ్రీకాకుళం: సంక్రాంతి ముందు..ప్రయాణికులకు షాక్

శ్రీకాకుళం ఆర్టీసీ హైయర్ బస్సు యజమానులు గురువారం జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణకు సమ్మె నోటీస్ అందజేశారు. ఈనెల 12 నుంచి సమ్మె చేయనున్నట్లు నోటీసులో ప్రస్తావించారు. మహిళల ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తిలో భాగంగా బస్సుకు నెలకు అదనంగా రూ.20 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆక్యుపెన్సీ పెరిగినా గిట్టుబాటు ధర చెల్లించడం లేదని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
News January 9, 2026
శ్రీకాకుళం జిల్లాలో రూ.135.37 కోట్లతో విద్యుత్ ఆధునీకరణ పనులు

శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ ఆధునీకరణ పనులకు రూ 135.37 కోట్లు మంజూరయ్యాయని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. రూ. 80 కోట్లతో శ్రీకాకుళంలో 132/23 కేవీ విద్యుత్ ఉపకేంద్రం చిలకపాలెం-అంపోలు మధ్యలో నిర్మిస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాల్లో త్వరితగతిన విద్యుత్ సరఫరా అవుతుందన్నారు.


