News November 8, 2024

శ్రీకాకుళం: పోస్ట్ ఆఫీస్‌లోనే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ ఫలాలు తప్పకుండా రావాలంటే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ తప్పనిసరిగా ఉండాలని శ్రీకాకుళం డివిజన్ ఐపీపీబీ అధికారి షరీఫ్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా గ్రామంలోని పోస్ట్ ఆఫీస్‌‌ను సంప్రదించాలన్నారు. దీని కోసం పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకుని, సంక్షేమ ఫలాలు నేరుగా పోస్ట్ ఆఫీసుల్లోనే పొందవచ్చని తెలిపారు.

Similar News

News November 23, 2024

శ్రీకాకుళం: ‘రూ.20 లక్షలతో బిజినెస్ పెట్టండి’

image

శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాలలో అగ్రి క్లినిక్స్ & అగ్రి బిజినెస్ సెంటర్స్ (ACABC) స్కీమ్‌పై నాబార్డ్ జిల్లాస్థాయి వర్క్‌షాప్ శుక్రవారం జరిగింది. నాబార్డ్ డీడీఎం రమేశ్ కృష్ణ మాట్లాడుతూ.. అగ్రి గ్రాడ్యూయేట్లు ఈ పథకం ద్వారా రూ.20 లక్షలతో బిజినెస్ చేస్తే రూ.8.8 లక్షల వరకు సబ్సిడీ వస్తుందని తెలిపారు. అసోసియేట్ డీన్ డాక్టర్ లక్ష్మి, అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు.

News November 23, 2024

IESలో సిక్కోలు వాసికి మూడో ర్యాంక్

image

ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్(IES) పరీక్షలో సిక్కోలు జిల్లా వాసి సత్తాచాటారు. పోలాకి మండలం జిల్లేడు మాకివలసకు గొల్లంగి సతీశ్ పరీక్ష రాయగా శుక్రవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఆయన మూడో ర్యాంక్ సాధించారు. ఇదే పరీక్షల్లో గతేడాది 15వ ర్యాంకు వచ్చింది. నిరుపేద కుటుంబానికి చెందిన తన తల్లి నిర్మలమ్మ అండగా నిలవడంతో ఈ విజయం సాధించానని ఆయన తెలిపారు. 

News November 23, 2024

SKLM: ముగిసిన B.Ed సెమిస్టర్ పరీక్షలు

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో B.Ed 2వ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలు ఈనెల 19వ తేదీన ప్రారంభమయ్యాయి. మొత్తం జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పరీక్షలు నిర్వహించారు. జిల్లా పరిధిలోని B.Ed కళాశాలల నుంచి 901 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.