News May 11, 2024

శ్రీకాకుళం: ప్రచారాలు చేయరాదు: కలెక్టర్

image

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పోలింగ్ తేదికి 48 గంటల ముందు అనగా ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుంచి ప్రచారం ఆపేయాలని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జీలాని సమూన్ పేర్కొన్నారు. ఈ సైలెన్స్ పీరియడ్‌లో ఎవరు ప్రచారం చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల12, 13 తేదీల్లో మద్యం అమ్మకాలు నిలిపి వేయాలని ఆయన ఆదేశించారు.

Similar News

News November 26, 2024

మందస: ముగిసిన యుటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు

image

సామాజిక అంతరాలను రూపుమాపేదే విద్య అని యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. మందస మండలం హరిపురంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు సోమవారంతో ముగిశాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా, ప్రజలకు ఇబ్బంది వచ్చిన ప్రతి సందర్భంలోనూ వారిని ఆదుకోవడానికి యుటీఎఫ్ కార్యకర్తలు పని చేస్తారని తెలిపారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.

News November 25, 2024

SKLM: డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇవ్వగా ఆ గడువు 25వ తేదీతో ముగుస్తుంది. రూ.500 అపరాధ రుసుముతో 27 వరకు, రూ.1500 అపరాధ రుసుముతో ఈనెల 28 వరకు అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 12వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

News November 25, 2024

సీతంపేట: విషాదం మిగిల్చిన వనభోజనం

image

సీతంపేట మండలం అడలి వ్యూ పాయింట్ వద్ద ఆదివారం వన భోజనానికి వెళ్లిన ఒక కుటుంబం తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వారు వెళ్తున్న బైక్ అదుపు తప్పి లోయలో పడింది. బైక్ మీద ఉన్న దుప్పాడ భారతి(33) (విద్య కమిటీ ఛైర్మన్) మృతి చెందారు. భర్త దుర్గారావు, చిన్నారులు మేఘన, పల్లవికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.