News June 27, 2024
శ్రీకాకుళం: ప్రత్యేక రైళ్లను పొడిగించిన రైల్వే అధికారులు

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా న్యూ టిన్‌సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జూలై 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి మంగళవారం, నం.05951 SMVB- NTSK రైలును జూలై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News September 15, 2025
సీఎం సమీక్ష సమావేశంలో సిక్కోల్ మంత్రి, కలెక్టర్

సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్ర రాజధాని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. అభివృద్ధి పదం వైపు నడుస్తున్న రాష్ట్రాన్ని, జిల్లాలను అధికారులు సమన్వయంతో పనిచేసే మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
News September 15, 2025
శ్రీకాకుళం: కలెక్టర్ గ్రీవెన్స్‌కు 81 అర్జీలు

అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 81 అర్జీలు స్వీకరించామన్నారు. ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఉన్నారు.
News September 15, 2025
టెక్కలి: బహుభాషా కోవిధుడు రోణంకి

టెక్కలికి చెందిన ఆచార్య రోణంకి అప్పలస్వామి 1909లో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ(ఆంగ్లం) పూర్తిచేసిన ఈయన ఆంధ్రాయూనివర్సిటీలో ఆచార్యునిగా బోధించారు. ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్ వంటి భాషలను అధ్యయనం చేశారు. బహుభాషా కోవిధుడుగా ఆదర్శంగా నిలిచారు. 1922-77 కాలంలో జాతీయ ఉపన్యాసకునిగా భారత ప్రభుత్వం నియమించింది. టెక్కలిలో విగ్రహంతో పాటు ఒక వీధికి ఈయన పేరు పెట్టారు. నేడు రోణంకి 116వ జయంతి.