News March 9, 2025
శ్రీకాకుళం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీ నోటిఫికేషన్

శ్రీకాకుళం జిల్లాలోని సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని డీసీహెచ్ కళ్యాణ బాబు ఆదివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 10-15 తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియేటర్ అసిస్టెంట్, ఆడియోమెట్రీషియన్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండర్, ప్రింటర్ పోస్టులకు ఖాళీలకు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 10, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి 17,523 మందికి గాను 17,171 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని తెలిపారు. కాగా సోమవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు.
News March 10, 2025
సోంపేట: 5 రోజుల వ్యవధిలో భార్యాభర్తల మృతి

సోంపేట మండలం కొర్లాం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీగా పనిచేసిన తామాడ గణపతి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన భార్య తామాడ భారతి కూడా సరిగా 5 రోజుల ముందు మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా పనిచేశారు.
News March 10, 2025
శ్రీకాకుళం: భక్తులకు నేడు నిరాశే మిగిలింది..!

అరసవల్లి సూర్యభగవానుడు రెండో రోజు కూడా భక్తులను కరుణించలేదు. వాతావరణం మబ్బులతో ఉండటంతో సూర్యకిరణాలు ఆదివారం ఆదిత్యుడిని తాకలేదు. దీంతో ఎంతో ఆశతో దర్శనానికి వచ్చిన భక్తులకు నిరాశే ఎదురైంది. రెండో రోజు సోమవారం కూడా మంచు, మబ్బులు కారణంగా భానుడు ఆదిత్యుని పాదాలు తాకలేదు.