News May 30, 2024
శ్రీకాకుళం: బాలికపై లైంగిక వేధింపులు

జలుమూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు పక్క గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఉంది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో శ్రీకాకుళం నగరంలో నివాసముంటూ కుమార్తెను చదివిస్తున్నారు. ఆ యువకుడు బాలికను మళ్లీ కలుస్తుండేవాడు. తనతో తీసుకున్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వాసుదేవరావు తెలిపారు.
Similar News
News November 11, 2025
SKLM: పిల్లలు దత్తత కావాలా.. ఐతే ఇలా చేయండి

అర్హులైన తల్లిదండ్రులు మిషన్ వాత్సల్య వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో దత్తత ప్రక్రియపై కరపత్రాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని విమల ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. www.missionvataslya.wcd.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాలన్నారు.
News November 10, 2025
SKLM: ‘బిల్లుల చెల్లింపు, భూసేకరణ పరిష్కరించాలి’

వంశధార ప్రాజెక్ట్ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని, పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. వంశధార ప్రాజెక్ట్ పురోగతిపై సోమవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక ప్యాకేజీల క్రింద పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.18.09 కోట్ల విలువైన బిల్లుల చెల్లింపును వేగవంతం చేయాలన్నారు.
News November 10, 2025
శ్రీకాకుళం కలెక్టర్ గ్రీవెన్స్‌కు 102 అర్జీలు

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 102 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. అందులో రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్తు సంస్థ వంటి పలు శాఖలకు దరఖాస్తులు అందాయన్నారు. త్వరగతిన అర్జీలు పూర్తి చేయాలని అధికారులను సూచించారు.


