News June 7, 2024
శ్రీకాకుళం: బీ-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీ-ఫార్మసీ(2017-18 రెగ్యులేషన్) కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జూలై 25 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు టైం టేబుల్, ప్రాజెక్టు వర్క్ షెడ్యూల్ పూర్తి వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
Similar News
News February 25, 2026
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 737 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షకు 737 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేశ్ తెలిపారు. బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 21,101 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 20,364 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. 96.51 హాజరు శాతం నమోదు అయిందని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు.
News February 25, 2026
శ్రీకాకుళంలో 64 మంది డయేరియా బాధితులు

శ్రీకాకుళంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో 64 మంది డయేరియా బాధితులు చికిత్స పొందుతున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఇద్దరు అత్యవసర చికిత్స పొందుతున్నారని చెప్పారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
News February 25, 2026
శ్రీకాకుళంలో డయేరియా.. అధికారుల ప్రత్యామ్నాయం

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలడంతో ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేశారు. పైప్ లైన్‌లో డ్రైనేజ్ నీరు చేరటం వల్ల నీరు కలుషితమైందన్న అనుమానం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్. కూర్మారావు తెలిపారు. మరో పక్క కుళాయిల ద్వారా సరఫరా చేసిన తగునీటిని విశాఖపట్నానికి పరీక్షల నిమిత్తం పంపారు.


