News March 10, 2025

శ్రీకాకుళం: భక్తులకు నేడు నిరాశే మిగిలింది..!

image

అరసవల్లి సూర్యభగవానుడు రెండో రోజు కూడా భక్తులను కరుణించలేదు. వాతావరణం మబ్బులతో ఉండటంతో సూర్యకిరణాలు ఆదివారం ఆదిత్యుడిని తాకలేదు. దీంతో ఎంతో ఆశతో దర్శనానికి వచ్చిన భక్తులకు నిరాశే ఎదురైంది. రెండో రోజు సోమవారం కూడా మంచు, మబ్బులు కారణంగా భానుడు ఆదిత్యుని పాదాలు తాకలేదు. 

Similar News

News March 10, 2025

గార: సముద్ర స్నానాల్లో అపశ్రుతి

image

గార మండలంలోని చిన్నవత్సవలస రాజమ్మ తల్లి జాతర సముద్ర స్నానాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం జి. సిగడాం మండలం దేవరవలసకు చెందిన తండ్రీ, కొడుకులు కొడమటి ఈశ్వరరావు, అశోక్(23) సముద్ర స్నానానికి వెళ్లగా అలల తాకిడికి గల్లంతయ్యారు. తోటివారు కేకలు వేయడంతో మెరైన్ పోలీసులు స్పందించి, తండ్రి ఈశ్వరరావును ఒడ్డుకు తీసుకొచ్చారు. అశోక్ ఆచూకీ దొరకలేదు. ఎస్ఐ జనార్దన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 10, 2025

SKLM: జడ్పీలో నేడు గ్రీవెన్స్ నిర్వహణ

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రేపు (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జడ్పీ సమావేశ మందిరంలో జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు.

News March 9, 2025

శ్రీకాకుళం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీ నోటిఫికేషన్

image

శ్రీకాకుళం జిల్లాలోని సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని డీసీ‌హెచ్ కళ్యాణ బాబు ఆదివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 10-15 తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియేటర్ అసిస్టెంట్, ఆడియోమెట్రీషియన్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండర్, ప్రింటర్ పోస్టులకు ఖాళీలకు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

error: Content is protected !!