News January 11, 2026
శ్రీకాకుళం: మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం

శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం సాయంత్రం ఆయనను ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. కుటుంబ సభ్యులు వైద్యుల నుంచి అతని ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి బులిటెన్ విడుదల కాలేదు. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం.
Similar News
News January 27, 2026
శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన ట్రెజరీ అధికారులు

కిల్లిపాలేం గ్రామ సచివాలయంలో పని చేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ హేమ రాగిణి శాలరీ ఏరియర్స్ బిల్లులు నిలిచిపోయాయి. ఈ బిల్లలు చెల్లించాలని ఇటీవల ఆమె శ్రీకాకుళంలోని సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లగా ట్రెజరీ ఆఫీసర్ రవి ప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాసరావులు రూ.15 వేలు డిమాండ్ చేశారు. ఆమె ఏసీబీ అధికారులను సంప్రదించగా..ఇవాళ సదరు డిజిటల్ అసిస్టెంట్ నుంచి అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు.
News January 27, 2026
పలాస: కుటుంబ కలహాలతో యువకుడి హంగామా

పలాస కేటీ రోడ్డు ఇందిరా చౌక్ వద్ద నడిరోడ్డుపై మంగళవారం ఉదయం <<18971917>>మద్యం మత్తులో ఓ యువకుడు<<>> తన చేయిని కోసుకొని వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశ్నించిన వాహనదారులపై దాడికి యత్నించి భయాభ్రాంతులకు గురి చేశాడు. దీంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలాస రాజాం కాలనీలో నివాసం ఉంటున్న తిరుపతి రావు కుటుంబ కలహాలతో ఈ ఘటనకు పాల్పడినట్లు కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు.
News January 27, 2026
శ్రీకాకుళం: యాక్సిడెంట్.. రైస్ మిల్లర్ మృతి

నరసన్నపేటకు చెందిన రైస్ మిల్లర్ వెంకటరమణ (67) విశాఖపట్నం మద్దిలపాలెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. మంగళవారం ఉదయం తన కుమార్తె ఇంటి వద్ద నుంచి మార్కెట్‌కు స్కూటీపై వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


