News October 3, 2025

శ్రీకాకుళం: మునిగిన రోడ్డు.. సాహసం చేశారు!

image

భారీ వర్షాలకు నందిగామ మండలం ఉయ్యాలపేట వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. ఆ గ్రామానికి 108 అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు సాహసం చేశారు. కర్రకు డోలీ కట్టి మెయిన్ రోడ్డు వరకు ఆయనను మోసుకెళ్లారు.

Similar News

News October 3, 2025

SKLM: ఇద్దరు మృతి.. రూ.8 లక్షల పరిహారం

image

భారీ వర్షాలకు మందస మండలం టుబ్బూరులో మట్టి గోడ కూలి భార్యాభర్తలు సవర బుడియా, రూపమ్మ <<17900358>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. సీఎం చంద్రబాబుకు జరిగిన విషయాన్ని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల చొప్పున రూ.8 లక్షల పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు త్వరలో చెక్కులు అందజేయనున్నారు.

News October 3, 2025

శ్రీకాకుళం: 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

image

వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 3వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. నదిలో ప్రస్తుతం 1,04,891 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు హెచ్చరికలను గమనించాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే కలెక్టర్ కార్యాలయంలోని టోల్ ఫ్రీ నంబర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు.

News October 3, 2025

శ్రీకాకుళం: నేటి నుంచి టీచర్లకు శిక్షణ

image

శ్రీకాకుళం డీఎస్సీ-2025 ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుక్రవారం నుంచి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జిల్లాలో కొత్తగా ఎంపికైన 534 మంది టీచర్లకు గ్లోబల్ పబ్లిక్ స్కూల్, జే వై హాస్టల్, శ్రీవిశ్వ విజేత జూనియర్ కాలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరికి ఎక్కడ ట్రైనింగ్ సెంటర్ అనేది ముందుగానే సమాచారం ఇచ్చారు.