News April 15, 2025
శ్రీకాకుళం: మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ

మెగా డీఎస్సీ (ఎస్జీటీ & స్కూల్ అసిస్టెంట్- అన్ని సబ్జెక్టులు) పరీక్షలకు సిద్ధమవుతున్న జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్ (ఈబీసీ)ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఆన్‌లైన్ శిక్షణను అందిస్తోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో ఉండే ఈ శిక్షణకు టెట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.
Similar News
News April 21, 2025
ఎచ్చెర్ల: సీఎం పర్యటనకు స్థల పరిశీలన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26న మత్స్యకార భరోసా ప్రారంభ కార్యక్రమానికి ఎచ్చెర్ల పర్యటనకు రానున్నారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆర్డీవో ప్రత్యుష కార్యక్రమ ఏర్పాట్లకు మత్స్యకార గ్రామాలైన బుడగట్ల పాలెం ,జీరుపాలెం, కొవ్వాడలో స్థల పరిశీలన చేశారు. వీరి వెంట డీఎస్పీ, అధికారులు, కూటమి నాయకులు ఉన్నారు.
News April 21, 2025
అరసవల్లిలో పోటేత్తిన భక్తులు..పెద్ద మొత్తంలో ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి నేడు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.2,66,700- లు, పూజలు విరాళాల రూపంలో రూ.70,548, ప్రసాదాల రూపంలో రూ.1,38,320 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.
News April 21, 2025
కంచిలిలో వ్యవసాయ పరికరాలు పంపిణీ

కంచిలి మండలంలో సబ్ మిషన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం కింద వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే బెందాళం అశోక్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ అందజేశారు. అనంతరం ఈ పథకం కింద నిర్మించిన వ్యవసాయ గోడౌన్‌ను ప్రారంభించారు. ఈ ఆధునిక పరికరాలు రైతుల వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని చెప్పారు.