News November 9, 2024
శ్రీకాకుళం: మెలకువలు పాటిస్తే కేసులను చేధించవచ్చు: SP
సైబర్ నేరాల నియంత్రణ, నేరాలకు సంబంధించిన కేసులను చేధించడానికి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో సరైన మెలకువలు పాటిస్తే కేసులను ఛేదించటం చాలా సులుభం అవుతుందని అన్నారు.
Similar News
News November 12, 2024
అసెంబ్లీ విప్‌గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్
రాష్ట్ర అసెంబ్లీ విప్‌గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను ప్రభుత్వం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచిన అశోక్‌ను విప్‌గా నియమించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో భాగంగా అశోక్‌కు ఈ పదవి వరించింది.
News November 12, 2024
ROB భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్ దినకర్
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం వివిధ జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆర్ఓబీకి సంబంధించిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ట్రాన్స్‌కోకు సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉందని వాటిని త్వరలోనే ఇస్తామన్నారు.
News November 12, 2024
శ్రీకాకుళం: నేడే చివరి అవకాశం
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఇవాళ్టి(మంగళవారం)తో ముగుస్తుంది. పరీక్ష ఫీజును అక్టోబర్ 29 నుంచి చెల్లించేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రాక్టికల్స్ నవంబర్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయి. సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.