News December 13, 2024

శ్రీకాకుళం: యువకుడి జీవితానికి ‘ది ఎండ్’

image

శ్రీకాకుళం జిల్లా IIITలో <<14862988>>చనిపోయిన <<>>ప్రవీణ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవాడు. ఇటీవల కాస్త డల్‌ అయ్యాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు. మూడు రోజుల కిందట ‘ది ఎండ్’ అని మెయిల్లో రాశాడు. బుధవారం రాత్రి 12 గంటల వరకు చదువుకున్నాడు. తర్వాత బయటకు వెళ్తుండగా ఫ్రెండ్స్ చూసి ఎక్కడికి అని ప్రశ్నించారు. వాష్ రూముకు వెళ్తున్నా అని చెప్పి బిల్డింగ్‌ పైనుంచి దూకేశాడు. ‘నన్ను తీసుకెళ్లండి’ అన్నవే ప్రవీణ్ చివరి మాటలు.

Similar News

News December 26, 2024

మెగాస్టార్‌తో అచ్చెన్నాయుడు మటామంతీ

image

మెగాస్టార్ చిరంజీవితో గురువారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముచ్చటించారు. శంషాబాద్‌లో జరిగిన ఒక వేడుకలో(మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహం)లో చిరంజీవి, అచ్చెన్నాయుడు కలుసుకున్నారు. ఒకరినొకరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. ఈ మేరకు చిరంజీవితో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు పంచుకున్నారు.

News December 26, 2024

SKLM: పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

image

సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ ప్యాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.

News December 26, 2024

మందస: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

image

శ్రీకాకుళం జిల్లా మందస మండలం పితాతొలి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పలాస నుంచి మందసకు వెళ్తుండగా బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో సొండిపూడి లైన్ మేన్ జోగారావుతో పాటు మరో యువకుడు కిరణ్‌కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు.