News July 28, 2024
శ్రీకాకుళం: యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా నైపుణ్యాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్లపై చర్చించేందుకు కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News February 23, 2026
ఎర్రన్నాయుడు నాకు అత్యంత ఆప్తుడు: సీఎం చంద్రబాబు

కింజరాపు ఎర్రన్నాయుడు తనకు అత్యంత ఆప్తుడు అని సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం Xలో పోస్ట్ చేశారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని నివాళులు అర్పించారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఎర్రన్న చివరి క్షణం వరకు ప్రజా సేవలో ఉన్నారని చంద్రబాబు కొనియాడారు.
News February 23, 2026
SKLM: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

శ్రీకాకుళం ప్రభుత్వ ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును ఆయన సంబంధిత గదులకు వెళ్లి పరిశీలించారు. విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం వైద్య సదుపాయం పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడరాదని సూచించారు. పోలీస్ అధికారులు ఉన్నారు.
News February 23, 2026
నందిగాం: కళ్లల్లో కారం కొట్టి.. బంగారంతో పరార్

నందిగాం(M) నర్సాపురం గ్రామానికి చెందిన నెయ్యిల మహాలక్ష్మి మెడలో ఆదివారం బంగారం చైన్, పుస్తెలతాడు చోరీ జరిగింది. స్నానం కోసం గ్రామం శివారు చెరువుకు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి మెడలో పుస్తెలతాడు, చైన్ తెంపుకెళ్లిపోయారని బాధితురాలు తెలిపింది. ఆమె భర్త పార్వతీశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


