News December 1, 2025

శ్రీకాకుళం: రహదారి భద్రతను మెరుగుపరచడంపై చర్యలు

image

జిల్లాలో రహదారి భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే బహిరంగ మద్యం తాగడం, పబ్లిక్ న్యూసెన్స్‌పై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 17,509 పైగా డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 8,594 వేలకి పైగా కేసులు కోర్టుల ద్వారా శిక్షలు, జరిమానాల రూపంలో డిస్పోజ్ అయ్యాయని ఎస్పీ చెప్పారు.

Similar News

News December 6, 2025

శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

image

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.

News December 6, 2025

శ్రీకాకుళం: టెట్ ఎగ్జామ్ సెంటర్‌లు ఇవే

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఈ నెల 10-21 వరకు జరగనుంది. జిల్లాలో సుమారు 12 వేల పైచిలుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరికి ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
✦ఎగ్జామ్‌కు శ్రీకాకుళం జిల్లాలో కేటాయించిన కేంద్రాలు ఇవే:
➤ నరసన్నపేట-కోర్ టెక్నాలజీ
➤ఎచ్చెర్ల-శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల

News December 6, 2025

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు అలర్ట్

image

శ్రీకాకుళం జిల్లా మీదుగా విశాఖకు నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గరివిడి-సిగడాం-చీపురుపల్లి మధ్య భద్రతకు సంబంధించిన పనుల నేపథ్యంలో విశాఖ-పలాస-విశాఖ(67289/90) మెము రైలు, విశాఖ-బ్రహ్మపూర్-విశాఖ(58531/32) ప్యాసింజర్ రైలు, విశాఖ-బ్రహ్మపూర్-విశాఖ(18525/26) ఎక్స్ప్రెస్ ట్రైన్లు డిసెంబర్ 6-8వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.