News May 26, 2024
శ్రీకాకుళం: రేపటి నుంచి పాలిసెట్ సర్టిఫికేట్ల పరిశీలన

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిసెట్-2024 రాసిన అభ్యర్థులు ఫీజు చెల్లించిన వారు ఈ నెల 27 నుంచి జూన్ 3వ తేదీలోగా శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించుకోవాలి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 5 ప్రభుత్వ, 5 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 10,871 మంది పాలిసెట్ రాశారు. ఇందులో 9,576 మంది అర్హత సాధించారు.
Similar News
News February 23, 2026
శ్రీకాకుళం: ప్రయాణికులకు గమనిక

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే భువనేశ్వర్-బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం.18463/64) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు 3వ ఏసీ భోగిని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
News February 23, 2026
శ్రీకాకుళం: ‘ఇంటర్ పరీక్షకు 662 మంది డుమ్మా’

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 662 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 71 కేంద్రాల్లో 20,377 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 19,715 మంది హాజరైనట్లు తెలిపారు. 96.75 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరుగినట్లు, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదన్నారు.
News February 23, 2026
ఎర్రన్నాయుడు నాకు అత్యంత ఆప్తుడు: సీఎం చంద్రబాబు

కింజరాపు ఎర్రన్నాయుడు తనకు అత్యంత ఆప్తుడు అని సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం Xలో పోస్ట్ చేశారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని నివాళులు అర్పించారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఎర్రన్న చివరి క్షణం వరకు ప్రజా సేవలో ఉన్నారని చంద్రబాబు కొనియాడారు.


