News January 9, 2025

శ్రీకాకుళం : రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

image

శ్రీకాకుళం జిల్లా అన్ని పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాతి సెలవులు 10వ తేదీ నుంచి 19 వరకు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. తిరుమల చైతన్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు . అనంతరం పాఠశాలలు తిరిగి 20వ తేదీన తెరుచుకుంటాయన్నారు. రివిజన్ కోసం SSC,  ఇంటర్మీడియట్ విద్యార్థులకు హోమ్ వర్క్ ఇవ్వాలని ప్రిన్సిపాల్‌లకు సూచించారు.

Similar News

News January 9, 2025

SKLM: అగ్నివీర్ వాయుసేన పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారత వాయుసేన 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ ద్వారా క్లరికల్, టెక్నికల్ క్యాడర్‌లలో అగ్నివీర్ వాయుసేన పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదలైందని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్, ఐ.టి.ఐ, డిప్లొమా (పాలిటెక్నిక్) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. జనవరి 27, 2025 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్: https://agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News January 9, 2025

పాతపట్నం: లగేజ్ వ్యాన్ ఢీ.. వ్యక్తి మృతి 

image

పాతపట్నం మండలం కొరసవాడ శ్మశాన వాటిక సమీపాన గురువారం మధ్నాహ్నం స్కూటీ- లగేజీ వ్యాన్ ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన  మారెడ్ల కృష్ణారావు (53) గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.  

News January 9, 2025

శ్రీకాకుళం: ఇంటికి వెళ్దాం.. పండగ చేద్దాం

image

సంక్రాంతి సెలవుల నేపధ్యంలో గురువారం శ్రీకాకుళం జిల్లాలో వసతిగృహాల విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు. శుక్రవారం నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో టెక్కలిలో మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, బీసీ, ఎస్సీ, ఎస్టీ బాలురు, బాలికల వసతిగృహ విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో వసతిగృహాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మళ్లీ పండుగ అనంతరం విద్యార్థులు వసతిగృహాలకు రానున్నారు.