News December 23, 2024
శ్రీకాకుళం: రేపు దిశా కమిటీ సమావేశం
శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఆడిటోరియంలో మంగళవారం జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశా) కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ, మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుందని తెలిపారు. ఎంజి ఎన్ఆర్ఆఈజీఎస్, సంబంధించిన పథకాలు, మొదలగు వాటిపై ఈ సమీక్ష నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు
Similar News
News December 23, 2024
ఎచ్చెర్ల: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాల విడుదల
ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను యూనివర్సిటీ డీన్ ఉదయ్ భాస్కర్ సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా పరీక్ష పేపర్ల రీవాల్యుయేషన్, రివెరిఫికేషన్ కోసం రేపటి నుంచి నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News December 23, 2024
నరసన్నపేటలో యాక్సిడెంట్.. యువకుడు మృతి
నరసన్నపేటలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే సర్వీస్ రోడ్డులో పశుసంవర్ధక శాఖ అంబులెన్స్, బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎం.జగదీశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. సాయి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
News December 23, 2024
అంబేడ్కర్ యూనివర్సిటీకి రూ.20 కోట్లు మంజూరు
డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి రూ.20 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల కోసం అప్పటి వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు హయాంలో ఉషాకు ప్రతిపాదనలు పంపారు. ప్రధాన మంత్రి ఉచ్చతార్ శిక్షా అభియాన్ కింద ఈ నిధులు మంజూరు చేశారు. వాటిని యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన భవన నిర్మాణాలు, ఉద్యోగ ఉపాధికి కొత్త కోర్సులు ప్రవేశ పెట్టనున్నట్లు యాజమాన్యం తెలిపింది.