News May 12, 2024
శ్రీకాకుళం: రేపే పోలింగ్.. ఈ నంబర్లు మీకోసమే

జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశామని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్ తెలిపారు. ☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 18,92,457 మంది ☞ పోలింగ్ కేంద్రాలు- 2,358 ☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 520 ☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్- 18004256625 ☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం – 1950
Similar News
News December 19, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

➤శ్రీకాకుళం: ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన CHOలు
➤విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి: డీఈఓ
➤శ్రీకాకుళం జిల్లా సైనిక అధికారులకు గవర్నర్ ప్రశంస
➤ఒకే కళాశాల నుండి 25 మందికి అగ్నివీర్ ఉద్యోగాలు
➤మందస: పంట పొలాల్లో చెలరేగిన మంటలు
➤ఎచ్చెర్ల: కంకర రోడ్డులో కష్టంగా ప్రయాణం
➤జిల్లాలో పలుచోట్ల దట్టంగా కురుస్తున్న మంచు.
News December 19, 2025
విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి: శ్రీకాకుళం DEO

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు అవసరమని DEO రవిబాబు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని మునిసబేటలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థల ఆవరణలో సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన ఘనంగా ముగిసింది. జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మొత్తం 310 సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. రాష్ట్ర స్థాయికి 11 ప్రాజెక్టులు ఎంపికయ్యారన్నారు.
News December 19, 2025
శ్రీకాకుళం జిల్లా సైనిక అధికారులుకి గవర్నర్ ప్రశంస

విజయవాడలోని లోక్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అధికారులును గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ, టైపిస్ట్ మురళి చేస్తున్న ఉత్తమ సేవలకు గాను గవర్నర్ చేతుల మీదగా సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందుకున్నారు. సేవలు మరింత విస్తృతం చేయాలని గవర్నర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత ఉన్నారు.


