News August 28, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే నం.22643 పాట్నా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి 23 వరకు విజయవాడ- ఏలూరు- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ మార్గం గుండా ఈ ట్రైన్ నిడదవోలు చేరుకుంటుందని రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News December 21, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

★SKLM: రసాభాసగా జడ్పీ సర్వసభ్య సమావేశం
★అంగన్వాడీలకు 5జీ ఫోన్లు అందించిన అచ్చెన్న
★జిల్లా సమగ్ర అభివృద్ధి కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే కూన
★శ్రీకాకుళం: కొనుగోలు సరే..నగదు సమయానికి చెల్లించేనా ?
★రణస్థలం: గుంతల రోడ్డులో అవస్థల ప్రయాణం
★వైసీపీ వలనే గంజాయి ప్రభావం పెరిగింది: మంత్రి అచ్చెన్న
★సారవకోట: గ్రామాల్లో బెల్టు షాపుల జోరు

News December 20, 2025

శ్రీకాకుళం: ‘పోలియో విజయవంతం చేయాలి’

image

రేపు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా ప్రజలందరూ విజయవంతం చేయాలని శ్రీకాకుళం DM&HO అనిత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆమె కార్యాలయ నుంచి ఏడూ రోడ్ల కూడలి వరకు ర్యాలీ ప్రారంభించారు. 0 – 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. శతశాతం లక్ష్యం సాధించేలా కృషిచేయాలన్నారు. మోబైల్ టీమ్లు ప్రత్యేక బృందాలు కూడా ఉన్నాయన్నారు.

News December 20, 2025

SKLM: RTC డోర్ డెలివరీ పార్సిల్ ప్రారంభం

image

ఆర్టీసీ సంస్థలో పార్సిల్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ కార్గో పార్సిల్ కౌంటర్ వద్ద శనివారం ప్రారంభించారు. 50 కేజీల బరువున్న పార్సిల్ 10 కిలోమీటర్లు దూరం పరిధిలో ఉన్న స్థలాలకు సురక్షితంగా పంపించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 84 పట్టణాల్లో ఈ సేవలను ప్రారంభించాన్నారు.