News August 7, 2024
శ్రీకాకుళం: రైళ్లకు అదనంగా కోచ్‌ల జత

శ్రీకాకుళం రోడ్ మీదుగా భువనేశ్వర్, పుదుచ్చేరి మధ్య ప్రయాణించే రైళ్లకు అదనంగా జనరల్ కోచ్ జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12897/98 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఒక అదనపు జనరల్ కోచ్ జత చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైలు నం.12898 ఆగస్టు 6వ తేదీ నుంచి సెప్టెంబరు 24 వరకు, నం.12897 రైలును ఆగస్టు 7 నుంచి సెప్టెంబరు 25 వరకు అదనపు జనరల్ కోచ్‌తో నడపనున్నారు.
Similar News
News March 6, 2026
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

➤కాశీబుగ్గ: గంజాయితో ముగ్గురు అరెస్ట్
➤శ్రీకాకుళం: వైసీపీ నియోజకవర్గ పరీశీలకుల నియామకం
➤ కొండములగాం సీహెచ్సీలో నాగుపాము హల్‌చల్
➤మందస: ఎవరు వస్తారు..దారి మనదే బాగుచేసుకోవాల్సిందే!
➤శ్రీకాకుళం జిల్లాలో “పది” పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
➤నందిగాం మండల కేంద్రంలో లేగదూడల ప్రదర్శన
➤పలాస: ‘ప్రభుత్వ భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలి’
➤ పోలాకి తీర గ్రామాల్లో సోలార్ విద్యుత్ దీపాల ఏర్పాటు
News March 6, 2026
జడ్పీ ఎన్నికలు శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాలకే!

ఏపీలోని 2021లో జిల్లాల పునర్విభజన జరగక మొత్తం 13 జిల్లాలోని మండలాలకు జడ్పీ ఎన్నికలు జరిగాయి. అనంతరం 2022లో 26 జిల్లాలుగా YCP ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2024లో అధికారంలోకొచ్చిన కూటమి ఇటీవల 26ను..28 జిల్లాలుగా మార్చింది. గతంలో పాత జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు ఉమ్మడి శ్రీకాకుళంలోని పది నియోజకవర్గాల్లో జరిగాయి. ప్రస్తుతం 8 నియోజకవర్గాలకు జడ్పీ ఎన్నికలు జరిపేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
News March 6, 2026
కోరాడ కాలనీలో పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

హిరమండలం మండలం కోరాడ కాలనీ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. స్కూల్ అభివృద్ధికి రూ. 2,00,000లను, సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 25వేల నిధులను మంజూరు చేశారు.
శుభలయ ఆర్‌ఆర్కాలనీ వాటర్ ట్యాంక్ మెట్ల నిర్మాణానికి రూ.50వేల నిధులు మంజూరు చేశారు. జడ్పీటీసీ బుచ్చిబాబు ఉన్నారు.


