News December 24, 2024
శ్రీకాకుళం: విజిలెన్స్ మోనిటరింగ్ నూతన కమిటీ సభ్యుడిగా వాబ యోగి

జిల్లా విజిలెన్స్ మోనిటరింగ్ నూతన కమిటీని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం ప్రకటించారు. ఈ కమిటీల్లో భాగంగా సారవకోట మండలానికి చెందిన రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావును సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ ఎస్టీ కులం నుంచి తనను ఎంపిక చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు మంగళవారం ఉదయం కృతజ్ఞతలు తెలియజేశారు.
Similar News
News February 12, 2026
నదుల అనుసంధానంతో మారనున్న సిక్కోలు ముఖ చిత్రం

రానున్న రోజుల్లో గోదావరి-వంశధార నదుల అనుసంధానంతో సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో సిక్కోలు ముఖంచిత్రం మారనుంది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో జిల్లా రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ప్రక్రియ సాకారమైతే జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో వంశధార నది ఎండిపోకుండా గోదావరి జలాలు ఆదుకోనున్నాయి.
News February 12, 2026
SKLM : మహిళపై దాడి.. ఒకరిపై కేసు

కోటబొమ్మాళి మండలం కన్నెవలస గ్రామానికి చెందిన కాళ్ల సింహాద్రమ్మ తనపై దాడి చేసి గాయపరిచారని అదే గ్రామానికి చెందిన దేవాది అప్పలమ్మ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాగునీటి కుళాయి వద్ద నీరు పట్టుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చి కొట్టి గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి. సత్యనారాయణ తెలిపారు.
News February 12, 2026
SKLM: ఈనెల 17న చదరంగం పోటీలు

జిల్లాక్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17న శ్రీకాకుళం (M) శాంతినగర్ కాలనీలోని ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ మహేష్ బుధవారం తెలిపారు. అండర్-13, 15, 17, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలిచిన క్రీడాకారులు
https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.


