News March 30, 2025
శ్రీకాకుళం: వివాహిత హత్యకు కారణాలేంటి..?

శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహిత శుక్రవారం దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు వివరాల ప్రకారం.. కవిటి (మ) ఆర్.కరపాడుకు చెందిన మీనా, భర్త దిలీప్‌తో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా దుండగలు బీరు సిసాలతో తమపై దాడి చేశారని దిలీప్ చెప్పాడు. గాయపడిన మీనాక్షిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. ఎస్సై రవివర్మ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.
Similar News
News April 1, 2025
వజ్రపుకొత్తూరు: గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి

సముద్రంలో గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లుపేట గ్రామానికి చెందిన బొంగు ధనరాజు (35), వంక కృష్ణారావు (40) చనిపోయారు. మృతులకు భార్యాపిల్లలు ఉన్నారు. నలుగురు మత్స్యకారులు వేటకు వెళ్లగా బోటు తిరగబడి ప్రమాదం జరిగింది. ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకారుల మృతిలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 1, 2025
వజ్రపు కొత్తూరు: వేటకి వెళ్లిన మత్స్యకారులు గల్లంతు

వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు మంగళవారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదు. వారి కోసం గాలిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
News April 1, 2025
శ్రీకాకుళం: డీఈవోపై మంత్రి అచ్చెన్నకు ఫిర్యాదు

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సోమవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డీఈవో తిరుమల చైతన్యపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెనాయుడుకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల విద్యాశాఖలో జరిగిన పరిణామాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వివరించగా ఆయన వెంటనే స్పందించి కమిషనర్ విజయరామరాజుకు ఫోన్లో మాట్లాడి సమస్యను సద్దుమణిగినట్లు చూడాలని తెలిపారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.