News August 9, 2024
శ్రీకాకుళం: విశ్రాంతి భవనాన్ని సందర్శించిన ఎస్పీ

పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది విశ్రాంతి భవనం సబ్సిడరీ పోలీస్ కాంటీన్‌ని గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ కే.వీ మహేశ్వరరెడ్డి సందర్శించి నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్రాంతి భవనంలో నిర్వహణపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని హెడ్ క్వార్టర్స్‌కు వచ్చే సిబ్బంది అందరూ విశ్రాంతి తీసుకున్నందుకు అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు.
Similar News
News February 24, 2026
శ్రీకాకుళం: డయేరియా మృతుని కుటుంబానికి రూ.10 లక్షలు

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో డయేరియాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం తెలిపారు. మృతుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మెరుగైన వైద్యం, వైద్యుల నిరంతర పర్యవేక్షణ ఉండేవిధంగా ఆదేశాలిచ్చామన్నారు.
News February 24, 2026
సారవకోట: జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా 70 ఉద్యోగాలు

జిల్లా గ్రంథాలయ సంస్థలో 70 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాల్సి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకరరావు తెలిపారు. సారవకోట మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు జిల్లా పట్టణ, గ్రామీణ పంచాయతీల నుంచి రావలసిన 8% గ్రంథాలయ సెస్సులను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.
News February 24, 2026
శ్రీకాకుళం: జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల నిర్వహణ

శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. అండర్-18 పురుషులు, మహిళల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేశ్ బాబు పోటీలను పర్యవేక్షించారు. విజేతలు ఈనెల 28న ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.


