News April 17, 2024

శ్రీకాకుళం: శ్రీరామనవమి.. బంగారంతో సూక్ష్మ రామబాణం

image

శ్రీకాకుళంలోని పలాస మండలం కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన సూక్ష్మకళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి రామభక్తి చాటుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా బంగారంతో సూది మీద నిలబడే రామబాణంను మంగళవారం తయారుచేశారు. ఏటా వివిధ ప్రత్యేకతలు కలిగిన రోజుల్లో ఆయా పండగలకు తగ్గట్టుగా సూక్ష్మ ఆకృతులు తయారుచేయడం అలవాటు అని చెబుతున్నారు.  

Similar News

News February 1, 2025

శ్రీకాకుళం: హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

image

శ్రీకాకుళం మహిళా కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహం-3 వార్డెన్ ఎం.పూర్ణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి హాస్టల్ విద్యార్థినిపై జరిగిన దాడి నేపథ్యంలో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్ విద్యార్థినిపై వ్యక్తులు దాడి చేసిన విషయం సంచలనం కావడంతో యుద్ధప్రాతిపదికన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

News February 1, 2025

శ్రీకాకుళం: నిమ్మాడ హైవేపై కారు బోల్తా

image

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న కారు ముందు టైరు పేలడంతో డివైడర్‌ని ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలు అయ్యాయి. స్థానికులు సహాయంతో కారుని రోడ్డు పక్కన ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించారు.

News January 31, 2025

శ్రీకాకుళంలో రథసప్తమి సంబరాలకు సర్వం సిద్ధం

image

అరసవల్లి రథసప్తమి వేడుకలకు చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమవుతాయని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు.