News April 25, 2024
శ్రీకాకుళం: సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం సీఎం జగన్ పర్యటన వివరాలు మంగళవారం వెలువడ్డాయి. సీఎం జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాన్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు టెక్కలి మండలం అక్కవరం గ్రామం వద్ద జరగనున్న బహిరంగ సమావేశంలో సీఎం పాల్గొనున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.
Similar News
News September 11, 2025
నేపాల్‌లో తెలుగువారి కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్

నేపాల్‌లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఈ సేవలను తక్షణం అందుబాటులోకి తీసుకువచ్చారు. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు ఈ నంబర్‌కు 94912 22122 ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు.
News September 11, 2025
గోకర్ణపురం పాఠశాలను సందర్శించిన కలెక్టర్

కంచిలి మండలం గోకర్ణపురం ఎంపీపీ పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సందర్శించారు. పాఠశాలలో రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లో ‘యూ’ ఆకృతిలో చేపట్టిన బోధన విధానంపై ఆరా తీశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ-1 ఎస్ శివరాం ప్రసాద్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
News September 11, 2025
శ్రీకాకుళం: ‘జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అవ్వాలి’

శ్రీకాకుళం జిల్లాలో 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డీ ఆదేశించారు. బుధవారం SP కార్యాలయం నుంచి జిల్లాలో ఉన్న డీఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో వీసి నిర్వహించారు. పోలీసు స్టేషను స్థాయిలో రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కేసులను ముందుస్తుగా గుర్తించాలన్నారు.


