News July 7, 2025

శ్రీకాకుళం: సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడి

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో డీపీఆర్సీ వారు ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు స్టాల్‌లను DPO భారతి సౌజన్య సోమవారం పరిశీలించారు. సంపద కేంద్రాల్లో చెత్త ద్వారా వర్మీ కంపోస్టు తయారీ చేసి అమ్మకాలు జరపాలని తెలిపారు. సేంద్రియ ఎరువులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వలన అధిక పంట దిగుబడి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్సీ రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.

Similar News

News July 7, 2025

శ్రీకాకుళం: గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా..రూట్ మ్యాప్ ఇదే

image

గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈనెల 9 ఉ.6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలని సూచించారు.

News July 7, 2025

నందిగాం: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య

image

నందిగాం మండలం జయపురం గ్రామానికి చెందిన ఆర్.రత్నాలు(54) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గత కొద్ది రోజులుగా మహిళ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి ఇంటిలో పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో చేరుకున్న ఆమెను కుటుంబీకులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. నందిగాం పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 7, 2025

శ్రీకాకుళం IIITలో 149 సీట్లు ఖాళీ

image

శ్రీకాకుళం IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ ఇటీవల పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 867 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 149 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.