News August 8, 2025
శ్రీకాకుళం: 11న పాత ఎలక్ట్రానిక్ పరికరాల వేలం పాట

శ్రీకాకుళం మండలం తండేవలస జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో పాత ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామాగ్రిని వేలం వేస్తున్నట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఆగస్టు 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ వేలంపాట ఉంటుందని శుక్రవారం తెలిపారు. ఆసక్తి గలవారు స్టోర్ ఇన్‌ఛార్జ్ 9063477888, రిజర్వ్ ఇన్స్పెక్టర్ 6309990841 నెంబర్లలో సంప్రదించాలని చెప్పారు.
Similar News
News August 8, 2025
సోంపేట: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన పూనే సీతమ్మ (65) మృతదేహం సాదు మెట్ట వద్ద ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారాణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోవరాజు తెలిపారు.
News August 8, 2025
శ్రీకాకుళం ఏఎంసీ ఛైర్మన్ నియామకంపై వీడిన చిక్కుముడి

శ్రీకాకుళం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా జోత్స్న నియామకంపై చిక్కుముడి వీడింది. ఏఎంసీ ఛైర్మన్‌గా జోత్స్న ఎంపిక తర్వాత జనసేన, టీడీపీ పార్టీలో అసంతృప్తి రేగింన విషమం తెలిసిందే. ఆమెను వ్యతిరేకిస్తూ కొంతమంది బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సంప్రదింపులు తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జోత్స్ననే ఛైర్మన్‌గా కొనసాగుతుందని కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
News August 8, 2025
పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సిద్ధం చేయండి: శ్రీకాకుళం ఎస్పీ

జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని త్వరలోనే సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం శ్రీకాకుళం రూరల్ మండలం తండేం వలసలో ఉన్న శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ టీపీఎస్‌కు సంబంధించి శిక్షణ త్వరలో ప్రారంభించడం జరుగుతుందని వివరించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక పరిస్థితులు కల్పిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.