News August 10, 2025
శ్రీకాకుళం: ‘12వ మహాసభలు జయప్రదం చేయాలి’

అక్టోబర్ 4,5 తేదీల్లో సోంపేటలోని జరిగే సీఐటీయూ శ్రీకాకుళం జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అమ్మన్నాయుడు, తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఆ సంఘం కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించారు. ధరల పెరుగుదల, అవసరాలు దృష్టిలో పెట్టుకొని కార్మికుల కనీస వేతనం నెలకు రూ. 26,000లగా నిర్ణయించి అమలు చేయాలన్నారు.
Similar News
News August 10, 2025
రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం: అచ్చెన్నాయుడు

రైతుల అభ్యున్నతి, వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి మండలం నిమ్మడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రైతు అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలోని రైతులకు రూ.186 కోట్లు అన్నదాత సుఖీభవ నిధులు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పాల్గొన్నారు.
News August 10, 2025
ఆగస్టు 14న జిల్లాస్థాయిలో ప్రాచీన, గ్రామీణ క్రీడా పోటీలు

ఆగస్టు 14న జిల్లాస్థాయి ప్రాచీన గ్రామీణ క్రీడలు పోటీలు నిర్వహిస్తామని డీఎస్‌డీఓ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఏర్పాటై 75 ఏళ్లైన సందర్భంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు కోడి రామమూర్తి క్రీడా ప్రాంగణంలో పురుషులు, మహిళలకు కర్రసాము పోటీలు ఉంటాయన్నారు. సంగిడి, ముద్దార్, పిల్లిమొగ్గలు కేవలం పురుషులకు మాత్రమేనని చెప్పారు.
News August 9, 2025
ఆదిత్యుడి ఆలయంలో సీనియర్ సహాయకుడి సస్పెన్షన్

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్న శోభనాద్రిని సస్పెండ్ చేశారు. ఈవో ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో పారిశుద్ధ్య లోపంపై ఉన్నతాధికారుల అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో ఈయనపై వేటు పడింది.