News September 4, 2025

శ్రీకాకుళం: 14 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో 14 బార్ల లైసెన్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి సీహెచ్‌ తిరుపతినాయుడు బుధవారం తెలిపారు. శ్రీకాకుళంలో 8, పలాస 2, ఆముదాలవలస 2, ఇచ్చాపురం 2 బార్లు కేటాయించారన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 14 లోపు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 15న లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.

Similar News

News September 6, 2025

ఆముదాలవలస: అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య

image

అప్పుల బాధలు తాళలేక ఆముదాలవలసకు చెందిన చిరు వ్యాపారి బరాటం తాతయ్య (57) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. తాతయ్య 3 రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతను ఇంటికి రాకపోవడంతో సోషల్ మీడియాలో ఆచూకీ కోసం ప్రకటించారు. పట్టణంలోని పెద్ద చెరువు స్మశాన వాటిక వద్ద శుక్రవారం విగత జీవిగా పడిఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 6, 2025

శ్రీకాకుళం: ప్రయాణికులకు అలర్ట్

image

పెందుర్తి – సింహాచలం లైన్ మధ్య జరిగే సాంకేతిక పనులు కారణంగా నేటి నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈనెల 6, 8, 10, 12వ తేదీల్లో విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18526) & 7, 9, 11, 13వ తేదీల్లో బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (19525)ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 6, 2025

శ్రీకాకుళం: మాస్టార్లు మీకు వందనాలు

image

భావితరాలను సన్మార్గంలో నడిపించేది గురువే. వీరిని స్మరించుకునేందుకు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతినే నేడు ఉపాధ్యాయు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఉత్తమంగా విద్యనందించిన 60 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసి ఇవాళ కలెక్టర్ పురస్కారాలను ఇచ్చారు. స్టూడెంట్స్‌ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసిన ప్రైవేటు, ప్రభుత్వ టీచర్లకు మరోసారి గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు.