News December 25, 2025
శ్రీకాకుళం: 9 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు

ఇచ్ఛాపురంలో ఒక నిత్య పెళ్లికూతురు ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ యువతి మరో మహిళ సహాయంతో వరుసగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇటీవల వివాహం అనంతరం అనుమానం రావడంతో బాధితుడు ఇచ్ఛాపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్యపెళ్లికూతురుతో పాటు మరో మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం.బరంపురానికి చెందిన ఒక యువకుడిని పెళ్లిచేసుకుని మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు.
Similar News
News December 28, 2025
SKLM: ప్రతిభకు జిల్లా ఎస్పీ ప్రశంస

జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన కేసుల చేదన, గంజాయి పట్టివేత, గుడ్ వర్క్స్ వంటి అంశాల్లో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి అభినందించారు. ఎస్పీ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఉత్తమ సేవలకు గాను సీఐలు పైడపు నాయుడు,(SKLM రూరల్) చంద్రమౌళి,(సీసీఎస్) సత్యనారాయణ (ఆమదాలవలస)తో పాటుగా పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.
News December 27, 2025
SKLM: నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ సూచనలు

న్యూఇయర్, సంక్రాంతి, రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నెలవారీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా శనివారం రాత్రి శ్రీకాకుళంలో పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలో నేరాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు పరిరక్షణలో ముందుండాలని అధికారులకు సూచించారు.
News December 27, 2025
శ్రీకాకుళం: ఎస్పీకి దువ్వాడ ఫిర్యాదు

జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డిని శనివారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. తాజాగా తనపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, ఈ క్రమంలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎస్పీకి దువ్వాడ వివరించారు. గతంలో కూడా తనపై దాడి చేస్తామని బెదిరిస్తూ కాల్స్ చేశారని అప్పుడు కూడా పోలీసులకు పిర్యాదు చేసినట్లు దువ్వాడ తెలిపారు. దీనిపై పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.


