News March 10, 2025

శ్రీకాళహస్తిలో ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక?

image

హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక శ్రీకాళహస్తిలో జరగనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఈ విషయాన్ని త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు స్టార్ నటులందరినీ ఈ వేడుకకు తీసుకొచ్చేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నారట. ఈ చిత్రంలో కన్నప్పగా మంచు విష్ణు నటిస్తుండగా.. నందీశ్వరుడిగా ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News February 9, 2026

కార్వేటినగరంలో కోళ్లు మృతి.. DMHO తనిఖీలు

image

కార్వేటినగరం(M) RKVBపేటలో ఇందిరా కాలనీ వద్ద కోళ్ల ఫారంలో నాలుగు రోజులుగా కోళ్లు మృతి చెందుతున్నాయి. దీనిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం DMHO సుధారాణి కోళ్లఫారం ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

News February 9, 2026

వినతులకు సత్వర పరిష్కారం చూపండి: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులు ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్‌కు వచ్చినా ఫిర్యాదు మళ్లీ రాకుండా బాధితుల పరిధిలోనే పరిష్కరించేలా చూడాలని సూచించారు.

News February 9, 2026

సదుం: ‘నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి’

image

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోళ్ల ఫారం నిర్వాహకులు జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలని అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జెడి గుణశేఖర్ పిళ్ళై సూచించారు. ఫారంల వద్దకు దాణా, కోడిగుడ్లు సరఫరా చేసే వాహనాలను, ఇతర వ్యక్తులను రాకుండా చూడాలన్నారు. కోళ్ల ఉత్పత్తులు ఆహారం లో వినియోగించేవారు 100 డిగ్రీలు వేడి చేసి వాటిని తినాలని తెలిపారు.