News February 15, 2026

శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాల పేర్లు తెలుసా…!

image

బ్రహ్మోత్సవాలు అంటే వాహన సేవలు అని తెలుసు. కానీ శ్రీకాళహస్తిలో 9 రోజులు జరిగే వాటిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని అంటారు. దానికి పేర్లు ఉన్నాయి. 1వరోజు దేవరాత్రి, 2వరోజు భూతరాత్రి, 3వ రోజు గాంధర్వ రాత్రి, 4వరోజు నాగరాత్రి, 5వరోజు శివరాత్రి, 6వరోజు బ్రహ్మ రాత్రి, 7వరోజు స్కంద రాత్రి, 8వరోజు ఆనంద రాత్రి, 9వరోజు ఋషి రాత్రి అంటారు.

Similar News

News February 16, 2026

ఇలా అయితే ఆక్వా మనుగడ కష్టమే!(1/3)

image

ట్రేడర్ల చేతిలో, సిండికేట్ల చేతిలో నిలువునా దోపిడీకి గురవుతున్న ఆక్వా రైతులకు రాయితీలు కూడా అందని ద్రాక్షగానే మిగిలాయి. కనీసం ఫ్యాన్లు, ఏరియేటర్లు వంటి వాటిని కూడా రైతులకు రాయితీపై అందించడం లేదు. రూ.1.50 యూనిట్ విద్యుత్ ఛార్జ్ అని కేవలం అవి కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం పట్ల సాగు చేసే అందరి రైతులకు ఉపయోగపడటం లేదు. చెరువుల అనుమతుల విషయంలోనూ ప్రభుత్వాలు ఏమాత్రం రాయితీలు అందించిన పాపాన పోవడం లేదు.

News February 16, 2026

పెట్టుబడి ధరలు ఫుల్.. మద్దతు ధరలు నిల్..!(2/3)

image

ఆక్వా రైతులకు పెట్టుబడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫీడ్ తయారు చేసే సోయాబీన్ ధరలు తగ్గుముఖం పట్టినా రూ.60 వేలు ఉండే టన్ను ఫీడ్ ధర రూ. 90 వేలకు ఎగబాకింది. చెరువుల వద్ద ఏర్పాటు చేసే ట్రాన్సఫార్మర్ 40 కేవీ ధర 1.50 లక్షలు, 60 కేవీ ధర 2.50 లక్షలు గతంలో ఉండేది. ప్రస్తుతం అదే ట్రాన్సఫార్మర్ 60 కేవీ ధర రూ.5 లక్షలు అవుతుంది. ఇంతా భరించి పంట పండించినా సరైన ధర రాకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు.

News February 16, 2026

ప్రభుత్వ సాయం ఎక్కడ?(3/3)

image

ఈ పరిస్ధితుల్లో రైతులు ప్రతి దానికి సిండికేట్లను, దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. కనీసం చెరువుల నీటి పరీక్షలకు కూడా ప్రైవేటునే రైతులు ఆశ్రయిస్తున్నారు. ఆకివీడులో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్వా ల్యాబ్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. ల్యాబ్‌లో ఒక్క పరికరమూ పనిచేస్తున్న పాపాన పోవడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆక్వా రైతులను ఆదుకోకుంటే భవిష్యత్తులో ఆక్వా రంగం మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది.