News January 6, 2026
శ్రీకాళహస్తి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం

శ్రీకాళహస్తిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అప్పుల బాధలు తట్టుకోలేక సూసైడ్‌కు ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు వ్యాపారంలో నష్టపోయి 3 నెలల క్రితం శ్రీకాళహస్తి విచ్చేసి ఓ అద్దె ఇంట్లో భార్య ఉషశ్రీ, కొడుకు సాయి రాజేష్, కుమార్తె దీక్షితతో కలిసి కాపురం ఉంటున్నారు. ఆదివారం అప్పుల వాళ్లు వచ్చి బెదిరించడంతో ఎలుకుల మందు తాగారు.
Similar News
News January 7, 2026
ప్రణాళిక ప్రకారం మహిళా సంఘాలు ఎదగాలి: పీడీ శచీదేవి

మహిళా సంఘాలు ప్రణాళికాబద్ధంగా ఎదగాలని, ఇందుకోసం భవిష్యత్తు లక్ష్యాలను ముందుగా నిర్దేశించుకోవాలని DRDAప్రాజెక్ట్ డైరెక్టర్ కె. శచీదేవి సూచించారు. నక్కపల్లి వెలుగు సమాఖ్య కార్యాలయంలో బుధవారం జరిగిన మహిళా సంఘాల వాణిజ్య ప్రణాళిక రూపకల్పన ముగింపు సభలో బుధవారం ఆమె మాట్లాడారు. మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకటరమణ, ఏపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
News January 7, 2026
NZB: ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌కు అతిథి అధ్యాపకుల వినతి

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి బుధవారం సందర్శించారు. డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకులకు ఎంటీఎస్ విధానం, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఛైర్మన్ ఈ అంశం తమకు అవగాహన ఉందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
News January 7, 2026
రీసర్వే పనులు వేగవంతం చేయాలి: ఇన్‌ఛార్జి కలెక్టర్

అనంతపురం జిల్లాలో రీసర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీసర్వే, ఆర్‌ఓఆర్, మీసేవ, భూసేకరణ అంశాలపై సమీక్షించారు. డీఎల్‌ఆర్ పెండింగ్ గ్రామాల్లో ప్రతిరోజు ఒక గ్రామం డేటా పంపాలని సూచించారు. రైతులకు ముందస్తు నోటీసులు ఇచ్చి గ్రౌండ్ సర్వే పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.


