News November 4, 2025
శ్రీకాళహస్తి: తండ్రి, కుమారుడి మృతి

నాయుడుపేట-పూతలపట్టు హైవేలో నిన్న రోడ్డు <<18184479>>ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. శ్రీకాళహస్తికి చెందిన సుబ్రహ్మణ్యం(31) కుమారుడు రూపేశ్(11)తో కలిసి బైకుపై నాయుడుపేటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇంటికొస్తుండగా గురప్పతోట దగ్గర ట్యాంకర్ ఢీకొట్టింది. స్పాట్‌లో తండ్రి చనిపోగా శ్రీకాళహస్తి ఆసుపత్రిలో రూపేశ్ మరణించాడు. భర్త, కుమారుడు చనిపోవడంతో భార్య బోరున విలపించారు.
Similar News
News November 4, 2025
క్లాసెన్‌ను రిలీజ్ చేయనున్న SRH?

IPL: వచ్చే నెలలో జరిగే మినీ ఆక్షన్‌కు ముందు స్టార్ బ్యాటర్ క్లాసెన్‌ను SRH రిలీజ్ చేసే అవకాశం ఉందని ToI పేర్కొంది. ఇతడి కోసం పలు ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని తెలిపింది. గత మెగా వేలానికి ముందు రూ.23 కోట్లతో క్లాసెన్‌ను ఆరెంజ్ ఆర్మీ రిటైన్ చేసుకుంది. అతడిని రిలీజ్ చేస్తే వచ్చే డబ్బుతో మంచి బౌలింగ్ అటాక్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో జట్టును బ్యాలెన్స్ చేసుకోవచ్చని SRH భావిస్తున్నట్లు సమాచారం.
News November 4, 2025
వట్లూరు వద్ద రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

బెంగళూరుకు చెందిన ఉమాశంకర్ (72) యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బెంగళూరు నుంచి భువనేశ్వర్‌కు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ప్రమాదవశాత్తు మరణించారు. మంగళవారం ఉదయం ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని వట్లూరు సమీపంలో రైలు నుంచి జారిపడి ఆయన మృతి చెందారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 4, 2025
ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. <<-se>>#haircare<<>>


