News March 22, 2025

శ్రీకాళహస్తి తిరుచ్చిపై జ్ఞాన ప్రసూనాంబ దర్శనం

image

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉత్సవమూర్తికి అలంకారాలు చేశారు. తర్వాత తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.

Similar News

News March 22, 2025

అనకాపల్లి: రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి

image

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశింకోట మండలం నేషనల్ హైవేపై ఎన్‌జీ పాలెం వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకున్నాడు. అతికష్టం మీద అతడిని బయటకు తీశారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 22, 2025

HYD: భార్య వీడియోలు భర్తకు పంపి.. బ్లాక్ మెయిల్!

image

విదేశంలో HYD యువతికి వేధింపులు ఎదురయ్యాయి. శ్రీకృష్ణానగర్‌ వాసి 2018లో పనికోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన అబూబాకర్ ఆమె వ్యక్తిగత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. 2020లో బాధితురాలు HYD వచ్చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఏకంగా ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. కాల్ చేసినా ఆమె బయటకురావడం లేదని ఆ వీడియోలు ఆమె భర్తకు పంపాడు. ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 22, 2025

నేడు ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు

image

తెలంగాణలో వర్షాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. నిన్న కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది.

error: Content is protected !!