News July 2, 2024

శ్రీకాళహస్తి: మహిళ మెడలోని తాళిబొట్టు లాక్కొని పరార్

image

శ్రీకాళహస్తి: తొండమనాడు మార్గం అమ్మపాళెం సమీపంలో ఓ మహిళ మెడలోని తాళిబొట్టు లాక్కుని ఇద్దరు దుండగులు పరారైన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. అమ్మపాళెం గ్రామానికి చెందిన ఓ మహిళ వాకింగ్ చేస్తూ వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు బైక్‌పై వచ్చి మహిళ మెడలోని తాళిబొట్టు లాక్కొని పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 5, 2024

తిరుపతి సమస్యలను తీరుస్తా: మంత్రి దుర్గేశ్ 

image

రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతికి వచ్చిన మంత్రి కందుల దుర్గేశ్‌ను శుక్రవారం ఉదయం MLA ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి, కిరణ్ రాయల్ ఆత్మీయంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. అనంతరం ప్రజా సమస్యలపై మంత్రితో రాజారెడ్డి చర్చించారు. తిరుపతిలోని పర్యాటక శాఖలో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

News July 5, 2024

TPT: దరఖాస్తులకు రేపే చివరి తేదీ

image

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుందని కార్యాలయం పేర్కొంది. సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, వివిధ రకాల సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు https://www.tirumala.org/ వెబ్‌సైట్ చూడగలరు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జులై 06.

News July 5, 2024

చిత్తూరు: భార్యపై కత్తితో దాడి

image

భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసిన భర్తపై కేసు నమోదు చేసినట్లు సీఐ వలసయ్య తెలిపారు. గంగనపల్లెకు చెందిన సెల్వరాసన్ అదే కాలనీకి చెందిన ఆరిఫాను 13 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ పాప కూడా ఉంది. ఇంటి వద్ద గురువారం ఆరిఫాతో సెల్వ రాసన్ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఇంట్లో ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.