News April 13, 2025
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముగిసిన కొట్టాయి ఉత్సవం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం శనివారంతో ముగిసింది. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు స్వామి, అమ్మవార్లకు ఈ నెల 6 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పెద్ద కొట్టాయి ఉత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ప్రతిరోజు స్వామి, అమ్మవార్లను కోట మండపం వద్దకు తీసుకువచ్చి విశేష పూజలు జరిపారు. చివరి రోజైన శనివారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపి, పురవీధులలో స్వామి అమ్మవార్లను ఊరేగించారు.
Similar News
News April 13, 2025
శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు స్థానిక పాతాళ గంగలో స్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. సాధారణ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచి రద్దీ పెరిగింది.
News April 13, 2025
తజికిస్థాన్‌లో భూకంపం

తజికిస్థాన్‌లో ఇవాళ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై సమాచారం రావాల్సి ఉంది. మయన్మార్‌లోనూ ఇవాళ మరోసారి భూమి కంపించిన విషయం తెలిసిందే.
News April 13, 2025
మహాయుతి కూటమిలో విభేదాలు?

మహాయుతి కూటమిలో విభేదాలు తలెత్తాయని ప్రచారానికి తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన బలం చేకూరుస్తుంది. ఛత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా NCP ఎంపీ సునీల్ తత్కరీ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొనగా శివసేన నేతలెవరూ హాజరుకాలేదు. కాగా తాను ఆహ్వానించినప్పటికీ నేతలెవరూ విందుకు రాలేదని NCP ఎంపీ అన్నారు. దీంతో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమిలో ముసలం పుట్టిందని వార్తలు ప్రచారమవుతున్నాయి.