News March 27, 2025

శ్రీగిరిపై నేటి నుంచే ఉగాది మహోత్సవాలు

image

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు ఐదు రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలకు ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాలలో ప్రారంభ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాయంత్రం సాయంకాలార్చనలు, చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Similar News

News February 27, 2026

తిరుపతి: B.Ed ఫలితాలు విడుదల

image

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది డిసెంబర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) మూడో(3వ) సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.

News February 27, 2026

TU: ఎల్ఎల్‌బీ 5వ సెమిస్టర్ పరీక్షలు.. ఒకరు గైర్హాజరు

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎల్‌బీ ఐదో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 28 మంది విద్యార్థులకు 27 మంది హాజరుకాగా ఒక్కరు గైర్హాజరైనట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని తెలిపారు.

News February 27, 2026

DRDOలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

బెంగళూరులోని <>DRDO<<>>కు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ 8 రీసెర్చ్ అసోసియేట్, JRF పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. PhD, ME/MTech, BE/BTech, GATE స్కోరు ఉన్నవారు మార్చి 4 నుంచి 24 వరకు e- మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. RAకు నెలకు రూ.67,000, JRFకు రూ.37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/