News March 2, 2026

శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: కలెక్టర్

image

శాసనసభ సభాపతి పదవికి దుద్దిళ్ల శ్రీపాదరావు వన్నె తెచ్చారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లో యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీఓ వీణ, డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.

Similar News

News March 6, 2026

సివిల్స్ ఫలితాలు విడుదల

image

సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకు సాధించారు. ఆ తర్వాతి ర్యాంకుల్లో వరుసగా రాజేశ్వరి సువే, ఆకాన్ష్, రాఘవ్, ఇషాన్ భట్నాగర్ ఉన్నారు. మొత్తంగా 1,087 పోస్టులకు పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈసారి IASకు 180, IFSకు 55, IPSకు 150, గ్రూప్-A సెంట్రల్ సర్వీసెస్‌కు 507, గ్రూప్-B సర్వీసెస్‌కు 195 మంది ఎంపికయ్యారు.

News March 6, 2026

బిహార్ సీఎం నితీశ్ ఆస్తి రూ.1.66 కోట్లు

image

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు నిన్నటితో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. అభ్యర్థుల అఫిడవిట్ల ప్రకారం బిహార్ CM నితీశ్ కుమార్ అత్యల్ప ఆస్తులు కలిగి ఉన్నారు. తనకు స్థిర, చరాస్తులు ₹1.66Cr, FY25లో వార్షిక ఆదాయం ₹7.87L, చేతిలో కేవలం ₹20,552 నగదు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అత్యధిక ఆస్తులు కలిగిన నేతగా RJD అభ్యర్థి అమరేంద్ర నిలిచారు. తనకు ₹243Cr ఆస్తులు ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు.

News March 6, 2026

NLG: ఐటీఐ అభ్యర్థులకు ‘అప్రెంటిస్‌షిప్ మేళా’

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 9న ‘ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా’ నిర్వహించనున్నారు. స్థానిక అనుముల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ అండాలు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ముందుగా www.apprenticeship.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు.