News August 15, 2024

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 13.87 క్యూసెక్కుల నీరు నిలువ

image

ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకు 477.51 అడుగులకు గాను ప్రస్తుతం 13.87 టిఎంసిలు నీరు నిల్వ ఉంది ఉంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 2,518 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా 3,810 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.

Similar News

News October 7, 2024

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తాం: జగిత్యాల ఎస్పీ

image

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్‌ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో వచ్చిన అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

News October 7, 2024

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం

image

హుస్నాబాద్: EWS రిజర్వేషన్ల వల్ల SC, ST, BC విద్యార్థులకు DSCలో తీవ్ర అన్యాయం జరిగిందని BC సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు పిడిశెట్టి రాజు అన్నారు. సమాజంలో 6 శాతం ఉన్న ఉన్నత వర్గాలకు 10% రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

News October 7, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో పుణ్య స్థానాలు ఆచరించిన తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు. కోడె మొక్కులు చెల్లించుకుని అందరినీ చల్లగా చూడు స్వామి అంటూ వేడుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఈ లైన్లో దర్శనార్థం భక్తులు వేచి చూశారు.