News September 24, 2025
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్.. UPDATE

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి SRSP, కడెం ప్రాజెక్టుల నుంచి బుధవారం భారీగా వరదనీరు చేరుతోంది. ఇన్ఫ్లో 5,36,021 క్యూసెక్కులు. ఔట్ఫ్లో 5,64,077 క్యూసెక్కులు. ప్రాజెక్ట్ సామర్థ్యం 20.175 TMCలు. ప్రస్తుతనిల్వ 17.0183 TMCలు. లెవెల్- 146. 85/148.00M. ప్రాజెక్టుకు 40గేట్ల ద్వారా 5,63,680లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Similar News
News September 24, 2025
అక్టోబర్ 16 నుంచి కేయూ ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబరు 16 నుంచి నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అదనపు పరీక్షల నియం త్రణాధికారి డా.ఎమీ అసీం ఇక్బాల్ మంగళవారం తెలిపారు. అక్టోబరు 16, 18, 22, 24, 27, 29వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సా.5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
News September 24, 2025
మిడ్జిల్: విధుల్లోనే తహశీల్దార్‌కు గుండెపోటు

మహబూబ్ నగర్ జిల్లాలో ఓ తహశీల్దార్‌కు విధులోనే గుండెపోటు వచ్చిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. కార్యాలయ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాలు.. మిడ్జిల్ తహశీల్దార్ పులిరాజు బుధవారం యథావిధిగా ఎన్నికలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఉన్న చోటే కుప్పకూలారు. తోటి సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
News September 24, 2025
PDPL: సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నారు: కవిత

లాభాలను తక్కువగా చూపి సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నారంటూ MLC కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. నికర లాభంలో 34% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు కార్మిక సంఘం నేతలతో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా, ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 BONUSగా అందనుంది.