News February 7, 2025

శ్రీరంగాపూర్: విద్యుత్ షాక్‌తో యువతి మృతి

image

శ్రీరంగాపూర్ అంబేడ్కర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మౌనిక (20) ఉదయం ఇంటి వద్ద బట్టలు ఉతుకుతూ.. తడిచేతులతో మోటార్ ప్లగ్‌ను తీసేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో షాక్ తగిలి స్పాట్లో మరణించిదని కుటుంబ సభ్యులు తెలిపారు.  ఇటీవలే JLM ఉద్యోగం వచ్చిందని విధుల్లో చేరవలసి ఉందని పేర్కొన్నారు.

Similar News

News February 7, 2025

ఇవాళ రాత్రికి అంతర్వేదిలో కళ్యాణోత్సవం

image

AP: అంబేడ్కర్ కోనసీమ(D) సఖినేటిపల్లి(మ) అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఇవాళ జరగనుంది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో అర్చకులు కళ్యాణం జరిపించనున్నారు. దాదాపు 2-3 లక్షల మంది భక్తులు ఈ వేడుక కోసం తరలిరానున్నారు. ఆర్టీసీ దాదాపుగా 105 బస్సులు తిప్పుతుండగా, 1600 మంది సిబ్బందితో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

News February 7, 2025

24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 28న లేదా మార్చి 3వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. BAC సమావేశం తర్వాత ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.

News February 7, 2025

కోడిగుడ్డుపై అపోహలు.. వైద్యులేమన్నారంటే?

image

కోడిగుడ్డులో వైట్ మాత్రమే తినాలా? ఎల్లో తినొద్దా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అలాంటి వారికి డా.మోహన వంశీ క్లారిటీ ఇచ్చారు. ‘బరువు తగ్గాలి అనుకునేవారికి ఎగ్ వైట్‌‌ ఎంతో మంచిది. అదే ఎల్లోలో A,D,E,B12 అనే విటమిన్లు, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి, ఎనర్జీ కోసం చాలా అవసరం. ఎగ్స్ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్. ఎలా తిన్నా మీ ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోండి’ అని తెలిపారు. SHARE IT

error: Content is protected !!