News April 29, 2024
శ్రీరాంపూర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఇంటర్ ఫెయిల్ కావడంతో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీరాంపూర్‌లో చోటుచేసుకుంది. మంచిర్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ప్రథమ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4 సబ్జెక్టుల్లో అనుత్తీర్ణుడు కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో క్షణికావేశానికి గురై శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ తెలిపారు.
Similar News
News January 11, 2025
నాగోబా జాతరకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డిని మెస్రం వంశీయులు శుక్రవారం ఆహ్వానించారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఆదివాసీల ఆరాధ్యదైవం, మెస్రం వంశీయులతో పూజింపబడే కేస్లాపూర్‌కు జాతరకు రావాలన్నారు. మెస్రం వెంకటరావు పటేల్, మెస్రం మనోహర్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.
News January 11, 2025
జైపూర్: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బెస్ట్ అవార్డు
జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అవార్డును అందుకుంది. శుక్రవారం న్యూదిల్లీలో జరిగిన 3వ జాతీయ పవర్ జనరేషన్ వాటర్ మేనేజ్మెంట్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ అవార్డు లభించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యల్పంగా నీటిని వినియోగించినందుకు అవార్డును అందుకున్నట్లు అధికారి D.పంతుల తెలిపారు.
News January 11, 2025
నాగోబా జాతరకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డిని మెస్రం వంశీయులు శుక్రవారం ఆహ్వానించారు. రాష్ట్రంలోనే రెండవ గిరిజన జాతరగా పేరుగాంచిన ఆదివాసీల ఆరాధ్యదైవం, మెస్రం వంశీయులతో పూజింపబడే కేస్లాపూర్‌కు జాతరకు రావాలన్నారు. మెస్రం వెంకటరావు పటేల్, మెస్రం మనోహర్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.