News September 8, 2025

శ్రీరాంపూర్ ఏరియా 19 మందికి పదోన్నతి

image

సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా నుంచి 19మందికి డిప్యూటీ మేనేజర్లుగా పదోన్నతి లభించింది. సోమవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో సాత్విక్‌, వినయ్‌రెడ్డి, వెంకటరామ్‌, హేమంత్‌, వేణుగోపాల్‌, అనిల్‌, నాగరాజు, అనిల్‌సింగ్‌, జగదీశ్వర్‌ రావు, జలాలుద్దీన్‌, మధుసూదన్‌రావు, రవికిరణ్‌,శ్రీనివాస్‌, రొడ్డ రాజేష్‌, కిరణ్‌కుమార్‌, రాకేష్‌,నరేష్‌, సునీల్‌కుమార్‌,చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.

Similar News

News September 10, 2025

అనకాపల్లి: ‘పాడైపోయిన ఐరన్ వస్తువులకు వేలం’

image

పాడైపోయిన ఐరన్ వస్తువులకు విశాఖ కైలాసగిరి ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్‌లో ఈనెల 11న ఉదయం 10 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. వేలం పాటలో పాల్గొనేవారు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు రూ.500 డిపాజిట్ చెల్లించాలన్నారు. వేలం పాటను ఖరారు చేసుకున్నవారు అక్కడికక్కడే నగదు చెల్లించాలన్నారు. దీనికి 18 శాతం జీఎస్టీతో పాటు 12% ఇతర ఛార్జీలు అదనంగా చెల్లించాలన్నారు.

News September 10, 2025

ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్!

image

యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది. ‘ఐఫోన్ ఎయిర్’ పేరిట అత్యంత సన్నగా ఉండే మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది 6.5 ఇంచ్ ప్రో మోషన్ డిస్‌ప్లేతో వస్తుంది. అటు ఐఫోన్ 17లో 6.3inch డిస్‌ప్లే, 120hz రిఫ్రెష్ రేట్, 3NM A19 సిలికాన్ చిప్ ఉంటాయి. అన్ని మోడల్స్‌లో ఇంటర్నల్ బేస్ స్టోరేజ్ 256GBగా ఉంది. 17 ప్రో, ప్రో మాక్స్‌లో 48MP ట్రిపుల్ కెమెరా, A19 ప్రో చిప్ వంటి ఫీచర్లున్నాయి. వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.