News April 10, 2025

శ్రీరాంపూర్: కారు నడుపుతుండగా గుండెపోటు.. మృతి

image

విధి నిర్వహణలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన గురువారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో చోటుచేసుకుంది. ఏరియాలో ఎస్ఆర్పీ 3 గని మేనేజర్ వద్ద కాంట్రాక్టు వెహికల్ డ్రైవర్‌గా పనిచేస్తున్న కోటేశ్ విధి నిర్వహణలో వాహనం నడుపుతుండగా గుండెపోటుతో మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 18, 2025

రవితేజ మేనల్లుడి సినిమాలో నటించిన ఆదిలాబాద్ యువకుడు

image

హీరో ర‌వితేజ మేన‌ల్లుడు అవినాష్ వ‌ర్మ హీరోగా జ‌గ‌మెరిగిన స‌త్యం పేరుతో చిత్రీకరించిన MOVIE నేడు విడుదలైంది. మూవీలో అవినాష్ వర్మకు జోడీగా ఆద్య రెడ్డి, నీలిమ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ఈ మూవీతో తిరుప‌తి పాలే డైరెక్ట‌ర్‌గా తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం అవుతోన్నారు. కాగా ఈ సినిమాలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నిహల్ రాజ్ పుత్ నటించాడు. ఖైదీ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News April 18, 2025

ఆదిలాబాద్ జిల్లాలో మరో పైలట్ ప్రాజెక్ట్

image

ఇందిరా గిరి సోలార్‌ జల వికాసం పథకానికి రూ.12,500 కోట్ల ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం విధి విధానాలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలన్నారు. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చి.. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది.

News April 18, 2025

ADB: కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోస్ట్.. ఒకరిపై కేసు: CI

image

కాంగ్రెస్ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పట్టణానికి చెందిన శైలేష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సప్‌లో మెసేజ్ పోస్ట్ చేసినట్లు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రూపేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

error: Content is protected !!